తిరుపతి
*అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న. తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి బోర్డు సభ్యులతో కలిసి పాల్గొన్నారు *
- కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిశాయి.
- ఈ సందర్భంగా అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి, బోర్డు సభ్యులు బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన అందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
- ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , బోర్డు సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
- సేవలందించిన టీటీడీ అధికారులు, ఇంజనీరింగ్, ఆరోగ్యం, పారిశుధ్య, వైద్య, అన్నప్రసాదం, రవాణా, విద్యుత్ శాఖల సిబ్బందికి బోర్డు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
- శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేసిన పోలీస్ యంత్రాంగానికి, టీటీడీ విజిలెన్స్ విభాగానికి మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నిస్వార్థంగా సేవలందించిన శ్రీవారి సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని, వాహన సేవల విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు చేరవేయడంలో నిరంతరం సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బోర్డు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
