తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరి ఘట్టం అయిన పంచమి తీర్థం సందర్భంగా వేలాదిగా భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో తిరుచానూరు పుష్కరిణి, హోల్డింగ్ పాయింట్లు, క్యూ లైన్లు, ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ గారు, టిటిడి సివిల్ ఎస్‌వో శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్ గారితో కలిసి ఆదివారం సాయంత్రం విస్తృతంగా పరిశీలించారు. – ఈ సందర్భంగా చేసి, మొత్తం ప్రాంతాన్ని 120 సీసీ కెమెరాలు, 9 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. – SDRF మరియు NDRF బృందాలతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా నియమించడం జరిగింది – అదనపు ఎస్పీ స్థాయి అధికారుల నియామకంతో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు మానిటరింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. – పుష్కరిణి కి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు నలువైపులా హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి, అక్కడ భక్తులు విశ్రాంతి తీసుకునేలా వసతి, త్రాగునీరు, ఆహార పంపిణీ, మరుగుదొడ్ల వంటి అవసరమైన సౌకర్యాలను కల్పించారు. పుష్కరిణిలో ఒకేసారి ఎక్కువ మంది భక్తులు స్నానం చేయకుండా దశలవారీగా విడతల వారీగా పుణ్యస్నానం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసి, భక్తుల రద్దీని నియంత్రించే చర్యలను చేపట్టారు. – భద్రతా పరంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక క్రైమ్ టీంలను నియమించడం, పాత నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగించడం ద్వారా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. – ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి, భక్తుల వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల హోల్డింగ్ పాయింట్ల నుండి పుష్కరిణి వరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలిస్తూ, క్యూ పాయింట్ల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు. – పంచమి తీర్థం పుణ్య ఘడియలు ఆ రోజంతా కొనసాగనున్నందున భక్తులు ఆత్రుత చెందకుండా, పోలీసులకు సహకరిస్తూ నెమ్మదిగా పుణ్యస్నానం ఆచరించాలని భక్తులందరికీ కడపటి భక్తుడు వరకు కూడా పుణ్యస్నానం ఆచరించే విధంగా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.
